Air Pollution : ఢిల్లీలో రోజు రోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రారంతాలతో పాటు పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 473గా నమోదైంది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దాంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులుపడ్డారు.
పెరిగిన వాయు కాలుష్యం నేపథ్యంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కండ్లలో మంటలు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు తదితర సమస్యలతో బాధపడుతున్నారు. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరగడంతో ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -3ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఇక అశోక్ విహార్‌లో గాణి నాణ్యత సూచీ 471 నమోదైంది.
ఆ తర్వాత అలీపూర్ 424, బవానా 456, చాందినీ చౌక్ 400, బురారీ 354, మధుర రోడ్ 399, ద్వారక 457, ఐజీఐ విమానాశ్రయం 436, జహంగీర్‌పురి 470, ఐటీఓ 423, లోధి రోడ్ 383, ముండ్కా 461, టెంపుల్ రోడ్ 441, ఓఖ్లా 441, పట్పర్‌గంజ్ 472, పంజాబీ బాగ్ 459, రోహిణి 453, వివేక్ విహార్ 470, వజీర్‌పూర్ 467, నజాఫ్‌గఢ్ 460గా రికార్డయ్యింది. గురువారం పలుచోట్ల పొగమంచు పేరుకుపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
రానున్న పది రోజుల్లో ఢిల్లీ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండవని ఆ శాఖ అంచనా వేస్తోంది. ఒకటిన్నర డిగ్రీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అయితే, దేశ రాజధానిలో పొగమంచు, గాలి నాణ్యత సూచిక చాలా దారుణంగా మారుతోంది. ఎన్హెచ్ 24లో సాధారణంగా వేగంగా వెళ్లే వాహనాల వేగం కూడా గణనీయంగా తగ్గింది. ఎన్ హెచ్ 24లో ఉన్న అక్షరధామ్ టెంపుల్, లైట్ల మెరుపు కారణంగా రాత్రి దూరం నుండి కనిపించింది. కానీ పొగమంచు కారణంగా అక్షరధామ్ టెంపుల్ స్పష్టంగా కనిపించదు. పొగమంచుతో పాటు ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com