యుపిలో పౌర సంఘం సమావేశంలో నేతల తీరు.. అఖిలేష్ యాదవ్ రియాక్షన్

యుపిలో పౌర సంఘం సమావేశంలో నేతల తీరు.. అఖిలేష్ యాదవ్ రియాక్షన్
సూపర్.. సినిమా ఫైటర్స్ ని మించి పోతున్నారు రాజకీయనాయకులు..

సూపర్.. సినిమా ఫైటర్స్ ని మించి పోయారు రాజకీయనాయకులు.. అది అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా తగ్గేదే లే అంటున్నారు. నైతిక ప్రవర్తన గురించి, నడవడిక గురించి చట్ట సభల్లో నాయకులు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నారు. జనం ఓటేసి సీటు ఇప్పించినందుకు తగిన శాస్తి చెబుతున్నారు.

యుపిలో పౌర సంఘం సమావేశంలో బెంచీలు ఎక్కి మరీ ఒకరినొకరు తన్నుకుంటున్నారు. మునిసిపల్ కౌన్సిల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి జరిగిన సమావేశంలో షామ్లీ మున్సిపల్ చైర్మన్ అరవింద్ సంగల్, ఎమ్మెల్యే ప్రసన్ చౌదరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని అతి తీవ్ర ఘర్షణగా మారింది.

గురువారం షామ్లీలో జరిగిన సమావేశంలో మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు.

మున్సిపల్ చైర్మన్ అరవింద్ సంగల్, ఎమ్మెల్యే ప్రసన్ చౌదరి హాజరైన షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ బోర్డు సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మునిసిపల్ కౌన్సిల్‌లో నాలుగు కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి జరిగిన ఈ సమావేశం కొద్దిసేపటికే రసాభాసగా మారింది. ఇద్దరు సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో నగర పాలక బోర్డు సమావేశం హోరాహోరీగా సాగింది.

అఖిలేష్ యాదవ్ వైరల్ క్లిప్‌ను క్యాప్షన్‌తో పంచుకున్నారు: “అభివృద్ధి పనులు జరగనప్పుడు సమీక్షా సమావేశంలో ఇంకేం జరిగి ఉండవచ్చు? అందుకే షామ్లీలోని కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు జరిగాయి. బీజేపీ పాలన పాఠం. : మీ స్వంత భద్రతను ఏర్పాటు చేసుకున్న తర్వాత సమీక్ష సమావేశానికి రండి" అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన అంతా పోలీసులు, సీనియర్ నేతల సమక్షంలోనే జరిగింది.

Tags

Next Story