Al Falah: అల్ ఫ‌లాహ్ చైర్మ‌న్‌కు 415 కోట్ల విరాళాలు

Al Falah: అల్ ఫ‌లాహ్ చైర్మ‌న్‌కు 415 కోట్ల విరాళాలు
X
ఈడీ ప్రత్యేక ఫోకస్

అల్ ఫ‌లాహ్ గ్రూపు చైర్మ‌న్ జావ‌ద్ అహ్మ‌ద్ సిద్ధిక్‌కు విరాళాల రూపంలో 415 కోట్లు అందిన‌ట్లు ఈడీ పేర్కొన్న‌ది. త‌న ట్ర‌స్టుకు చెందిన విద్యాసంస్థ‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల నుంచి అక్ర‌మ రీతిలో ఆ నిధులను స‌మీక‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌ల్ఫ్‌లో ఫ్యామిలీ స‌భ్యులు స్థిర‌ప‌డ‌డం వ‌ల్ల అక్క‌డికి పారిపోయే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలిసింది. ఫ‌రీదాబాద్‌లో రోజంతా జ‌రిగిన త‌నిఖీల త‌ర్వాత అల్ ఫ‌లాహ్ వ‌ర్సిటీ గ్రూపు చైర్మ‌న్ సిద్దిక్‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

న‌వంబ‌ర్ 10వ తేదీన జ‌రిగిన ఎర్ర‌కోట కారు పేలుడు ఘ‌ట‌న‌తో వ‌ర్సిటీకి లింకు ఉన్న కార‌ణంగా ఆ కోణంలో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. 13 రోజుల పాటు ఈడీ క‌స్ట‌డీకి ఆయ‌న్ను అప్ప‌గించారు. త‌ప్పుడు అక్రెడిటేష‌న్‌, గుర్తింపు చూపిస్తూ విద్యార్థులు, పేరెంట్స్ నుంచి ఆ వ‌ర్సిటీ భారీగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ రూపంలోనే 415 కోట్లు సేక‌రించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ప‌రారీ అయ్యే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో అత‌న్ని క‌స్ట‌డీలోకి తీసుకుంటున్న‌ట్లు ఈడీ పేర్కొన్న‌ది. 1990 నుంచి అల్ ఫ‌లాహ్ వ‌ర్సిటీ అంచ‌లంచెలుగా ఎదిగింద‌ని, ఇప్పుడు ఓ పెద్ద విద్యాసంస్థ‌గా మారిన‌ట్లు తెలిపింది.

Tags

Next Story