ALERT: పండగకు ఊరెళ్లేవారు.. తస్మాత్‌ జాగ్రత్త

ALERT: పండగకు ఊరెళ్లేవారు.. తస్మాత్‌ జాగ్రత్త
పండగ సందడిలో ఇంటిని విడిస్తే చోరీలు జరిగే ప్రమాదం: నగరవాసులను హెచ్చరిస్తున్న పోలీసులు

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఉండే వారు వారి సొంత ఊర్లకు వెళుతున్న నేపథ్యంలో ఇళ్లల్లో దొంగలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. కావున ఇంటిని విడిచి పండగకు ఊరేళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో నగదు, బంగారం విలువైన వస్తువులను ఉంచరాదని హెచ్చరిస్తున్నారు. గస్తీకాసే సమయంలో పోలీసులకు సహకరించాలని తెలిపారు. చోరీలు జరిగే అవకాశం లేకుండా నగర పోలీసులు గస్తీకాస్తారని వెల్లడించారు.

Tags

Next Story