Gyanvapi Case: జ్ఞాన‌వాపి కేసులో ముస్లిం సంఘాలకు చుక్కెదురు

Gyanvapi Case:  జ్ఞాన‌వాపి కేసులో  ముస్లిం సంఘాలకు చుక్కెదురు
పిటిషన్‌లను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు

జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ తగలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్‌లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. 1991లో హిందు సంఘాలు వేసిన పిటిషన్ చెల్లుబాటు అవుతుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

జ్ఞానవాపి మసీదులో సమగ్ర సర్వేను నిర్వహించాలని వారణాసి ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8, 2021 నాటి ఆదేశాలను అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ (ఏఐఎంసీ), ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు డిసెంబరు వ్యతిరేకించాయి. జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ డిసెంబర్8న తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో ఆరు నెల‌ల్లోనే విచార‌ణ‌ను పూర్తి చేయాల‌ని వార‌ణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జ్ఞాన‌వాపి మ‌సీదులో పూజ‌లు నిర్వ‌హించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాలంటూ హిందువులు పిటీష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. ఆ పిటీష‌న్ ఆధారంగానే ఆ మ‌సీదులో సైంటిఫిక్ స‌ర్వే చేప‌ట్టారు. ఆ నివేదిక‌ను కూడా ఇటీవ‌ల కోర్టుకు స‌మ‌ర్పించారు. అయితే హిందువుల పిటీష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ ముస్లింలు దాఖ‌లు చేసిన పిటీష‌న్ల‌ను అల‌హాబాద్ హైకోర్టు ఇవాళ కొట్టిపారేసింది. ముస్లింలు మొత్తం అయిదు పిటీష‌న్లు దాఖ‌లు చేశారు. సున్ని సెంట్ర‌ల్ వ‌క్ఫ్‌బోర్డు, అంజుమ‌న్ ఇంతెజామియా మ‌సీద్ క‌మిటీ ఆ పిటీష‌న్లు వేశాయి.

Tags

Read MoreRead Less
Next Story