Tamilnadu : బైక్ పై స్పీడుగా వెళ్లాడని దళిత వ్యక్తులను కొట్టిన ముఠా..

వేలూరు జిల్లాలో ఇద్దరు ఎస్సీ వ్యక్తులపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. నవంబరు 14న సతుమదురై రైల్వే గేటు దగ్గర కొద్దిసేపు ఆగుతుండగా ద్విచక్రవాహనాన్ని వేగవంతం చేయడంతో కనియంబాడికి చెందిన తులసీరామన్ కుమారుడు దివాకర్ (26)ను ఇద్దరు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషించిన సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 14న సతుమదురై రైల్వే గేటు దగ్గర కనియంబాడికి చెందిన దివాకర్ అనే వ్యక్తి వేగంగా బండిని పోనిచ్చాడు. దీంతో అదే సమయంలో బండి పక్కగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు దివాకర్ ని అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో దివాకర్ వారి బండిని వెంబడించి ఎందుకు తిట్టారు అని అడిగాడు. దీంతో బండి మీద ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా దూషించడంతో పాటు..దాడికి పాల్పడ్డారు. దివాకర్ పై దాడి జరుగుతున్న సమయంలో శరవణన్ అనే వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన పై కూడా ఆ ముగ్గురు వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో శరవణన్ ఛాతీ పై అంబేద్కర్ పచ్చబొట్టు కనిపించింది. దీంతో దివాకర్, శరవణన్ ఇద్దరు కూడా ఎస్సీ వర్గానికి చెందిన వారని గ్రహించి వారి పై దాడికి దిగారు. ఈ క్రమంలో శరవణన్ స్పృహ కోల్పోవడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

బాధితుల్ని గమనించిన చుట్టుపక్కల వారు వారిని వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితులు కనియంబాడిలోని వేలూరు తాలూకా పోలీసు స్టేషన్ లో నలుగురు వ్యక్తుల పై ఫిర్యాదు చేశారు. నలుగురు వ్యక్తుల పై బాధితులు ఐపీసీ సెక్షన్లు 294 బీ, 324, 506 (2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తీవ్రంగా కొట్టడంతో శరవణన్ తలకు 13 కుట్లు పడ్డాయి. ఛాతీ పై పచ్చబొట్టును చూసిన తరువాత వారు మరింత రెచ్చిపోయి కుల దూషణ చేస్తూ గాయపరిచినట్లు వారు వివరించారు. అయితే ఈ ఘటన గురించి పోలీసులు ముందు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో వీసీకే కేడర్ మంగళవారం నిరసనకు దిగింది. ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ చట్టంలోని ఐపీసీ సెక్షన్ 294 బీ, 324, 506 (2) , 3(1) (ఆర్), 3 (2),(వీఏ) ప్రకారం నలుగురి పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఆకాష్, విజయ్, సతీష్‌కుమార్, తమిళ్‌సెల్వన్. వారిలో ముగ్గురిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, తమిళ్‌సెల్వన్ కోసం గాలిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com