America: నిద్రపోతున్నట్లు నటిస్తూ, మహిళను అసభ్యంగా తాకుతూ.. భారతీయుడికి రెండేళ్ల జైలు శిక్ష

విమానంలో ప్రయాణిస్తున్నారంటే అంతో ఇంతో చదువుకున్న వ్యక్తులే అయి ఉంటారు. అయినా సంస్కారం లేని కొందరు చీప్ గా ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లను చూస్తే చొంగ కార్చుకునే ఓ సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తుంటారు. అతడి ప్రవర్తనే అతడికి ఇప్పుడు రెండేళ్లు జైలు శిక్ష పడేలా చేసింది. నలుగురిలో పరువూ పోయింది.
వరుణ్ అరోరా ప్రస్తుతం చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా లేకుండా అమెరికాలో ఉన్నారని అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది.
దేశీయ విమానంలో తోటి ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అమెరికాలోని ఫెడరల్ జ్యూరీ ఒక భారతీయుడిని దోషిగా నిర్ధారించిందని జనవరి 30న US అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు 29, 2024న జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ శిక్ష విధించబడింది. నిందితుడు వరుణ్ అరోరా (38) రోడ్ ఐలాండ్ TF గ్రీన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయానికి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పక్క సీట్లో కూర్చున్న మహిళ నిద్రలో ఉంది. గమ్యస్థానం చేరుకున్న మహిళ మేల్కొని చూసేసరికి అరోరా తన చేతిని లైంగికంగా తాకుతున్నట్లు గుర్తించింది. ఆమె పదే పదే అతడి చేతిని దూరంగా నెట్టివేసినప్పటికీ, అరోరా నిద్రపోతున్నట్లు నటిస్తూ, స్లీప్ మాస్క్‌ను కవర్‌గా ఉపయోగించి ఆ చర్యను కొనసాగించాడని విమాన సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చింది.
దీనిని సీరియస్ గా తీసుకున్న అమెరికన్ జ్యూరీ తీర్పు తర్వాత, అరోరా ఇప్పుడు రెండేళ్ల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడు. అతని శిక్షను మే 7న ప్రకటించనున్నారు, అమెరికా శిక్షా మార్గదర్శకాలు మరియు ఇతర చట్టపరమైన అంశాలను సమీక్షించిన తర్వాత ఫెడరల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి తుది శిక్షను నిర్ణయించనున్నట్లు పత్రికా ప్రకటన తెలిపింది.
ఈ కేసును FBI యొక్క వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్ దర్యాప్తు చేసింది. అసిస్టెంట్ US అటార్నీ రస్సెల్ L కార్ల్‌బర్గ్‌తో కలిసి స్పెషల్ అసిస్టెంట్ US అటార్నీ మాడిసన్ ముమ్మా విచారణ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
