Haryana :నూహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

Haryana :నూహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
రెండు వారాల తరువాత మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, బ్రాడ్ బ్యాండ్ సేవలు మొదలు

మతఘర్షణలతో అట్టుడికిన హర్యానా నూహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. సుమారు రెండు వారాల తరువాత మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎమ్ఎస్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను తిరిగి ప్రారంభించారు. జిల్లాలో రెండు వర్గాల మధ్య హింసాత్మత ఘర్షణలు చెలరేగడంతో జులై 31న వీటిపై నిషేధం విధించారు. విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న ఓ మతపరమైన ఊరేగింపును కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

ఈ గొడవల్లో ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. రాను రాను పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. నూహ్ జిల్లాతో పాటూ చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్, పల్వాల్, ఫరీదాబాద్, హర్యానాలోని ఇతర జిల్లాలకూ ఈ గొడవలు వ్యాపించాయి. పలుప్రాంతాల్లోని షాపులు, ఫుడ్ జాయింట్స్ దుడుకు మూకల దాడిలో నాశనమయ్యాయి.


మరోవైపు నూహ్ అల్లర్లలో అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై హిందీ ఛానల్‌ సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లను మరింత పెంచేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు ఆరోపించారు. అయితే.. కొంతమంది గుండాలు అతన్ని అరెస్టు చేసినట్లు సుదర్శన్ ఛానల్‌ పేర్కొంది. దీనితో వివరణ ఇచ్చిన పోలీసులు.. సైబర్ క్రై విభాగం అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

ఆల్ జజిరా ఛానల్ ఒత్తిడి మేరకే గురుగ్రామ్ పోలీసులు, హిందు కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారని ట్వీట్టర్‌లో ముఖేష్ కుమార్ పోస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులకు విదేశీ మీడియా మార్గదర్శకం చేసిందని ఈ మేరకు హిందువులపై చర్యలు ఆరోపణలు చేస్తూ తీసుకుంటున్నారని ఎడిటర్ పోస్టులు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు..కుమార్ పోస్టులు నిరాధారమైనవని కొట్టిపడేశారు. ఐటీ చట్టం కింద అతనిపై చర్యలు తీసుకుంటున్నామంటూ అరెస్ట్ చేసి తరువాత విడుదల చేశారు. హర్యానాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 393 మందిని అరెస్టు చేశారు. 118 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. బ్రజ్ మండల్ హింసాకాండ కేసుకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 59 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 218 మందిని అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story