CAA : అప్పటి నుంచి సీఏఏ అమలు చేస్తాం : అమిత్‌షా

CAA : వివాదాస్పదమైన సీఏఏ చట్టం ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తాజా వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చింది. పశ్చమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి అమిత్‌షాను కలిసారు. బెంగాల్‌లో 1000 మంది అవినీతిపరులైన టీఎంసీల చిట్టా ఆయన చేతికి ఇచ్చారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్‌షాను కోరారు సువేందు. ఈ సందర్భంలో సీఏఏ కూడా చర్చలోకి వచ్చింది.
సువేందు మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షా స్వయంగా తనతో సీఏఏ అమలు త్వరలోనే జరుగుతుందని. కోవిడ్ ప్రికాషనరీ డ్రైవ్ తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లో ఉన్న మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే కార్యక్రమం మొదలవనున్నట్లు అమిత్‌షా అన్నారని సువేందు స్పష్టం చేశారు.
సీఏఏ చట్టానికి 2019, డిసెంబర్‌లో పార్లమెంటులో ఆమోదం లభించింది. దీని పై దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు వెల్లువత్తాయి. ఆ తరువాత కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ వల్ల ఈ చర్చ 2 సంవత్సరాలు వాయిదా పడింది. అయితే కేంద్రం కోవిడ్ ప్రికాషనరీ డ్రైవ్ ఎప్రిల్‌లో స్టార్ట్ చేసింది. మరో 9 నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com