Amritpal singh: ఎంపీగా అమృతపాల్ సింగ్ ప్రమాణస్వీకారం.

ఎంపీగా ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్ పాల్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి విజయం సాధించారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 2లక్షల మెజారిటీతో గెలిచారు. అయితే, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృతపాల్ ఖైదీగా ఉన్నారు. పెరోల్ దొరకకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణం చేసే రోజు చేయడానికి అతడికి సమయం కుదరదలేదు.. తాజాగా ఆయనకు నేటి నుంచి నాలుగు రోజుల పాటు బెయిల్ లభించింది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్ లో అమృతపాల్ సింగ్ తో ఎంపీగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. అలాగే, ఉగ్రనిధుల కేసులో నిందితుడు, బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ కూడా ఈరోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే, అమృత్ సర్ జిల్లా అన్నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్ పాల్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అతడు చాలాకాలం దుబాయిలో నివాసం ఉన్నాడు. వారిస్ పంజాబ్ ‘ సంస్థ వ్యవస్థాపకుడు దీపి సిద్ధూ చనిపోవడంతో అమృత్ పాల్ సింగ్ ఆ సంస్థకు తానే నాయకుడినని అంటూ ప్రకటించుకున్నాడు. నాటి నుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబినే స్థావరంగా సింగ్ ఎంచుకున్నాడు. అజ్నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాడు.. చివరికి రోడెవాల్లోని గురుద్వారాలో అతడిని పోలీసులు అరెస్టు చేసి డిబ్రూగఢ్ జైలుకు పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com