చీరకట్టులో కలరిపయట్టు.. పాఠాలు బోధిస్తున్న 80 ఏళ్ల బామ్మ..

పురాతన యుద్ధ కళ కలరిపయట్టును ఈ తరం యువతీ యువకులకు అందించాలన్న తపన ఆమె అణువు అణువులో ఉంది. చీరకట్టులో కూడా చాకచక్యంగా కర్ర తిప్పుతూ ఆమె పాఠాలు బోధిస్తుంటే చూస్తున్న వారు ఔరా అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పురాతన కళను బోధించే మార్షల్ ఆర్ట్స్ పుస్తకాలలో గుర్తించదగిన పేర్లలో ఒకటి - కలరిపయట్టు.
మీనాక్షి గురుక్కల్ ఎవరు?
విశాలమైన పట్టణం వడకరా నుండి వచ్చిన గురుక్కల్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మీనాక్షి గురక్కల్. తన తొలి రోజులను గుర్తు చేసుకుంటూ, కలరిపయట్టును తన 7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు నేర్చుకున్నానని తెలిపింది. అప్పటి నుంచి కలరిపయట్టును సాధన చేస్తున్నానని, ఎందరికో ఈ విద్యను బోధించానని తెలిపింది. ఈకళ అంతరించి పోకూడదని ఆమె కోరుకుంటోంది. తన తండ్రి తనను కలరి బృందం ప్రదర్శించిన ప్రదర్శనను చూడటానికి తీసుకువెళ్లి ఆమె దానిని మొదటిసారిగా పరిచయం చేశారు. "అది స్వాతంత్య్రానికి చాలా కాలం ముందు మా సోదరి, నేను ఈ కళను నేర్చుకోవాలని మా నాన్న నిశ్చయించుకున్నారు" అని ఆమె కలరిపట్టు నేర్చుకోవడానికి గల కారణాన్ని గుర్తు చేసుకున్నారు.
చివరికి, ఆమె ఆ విద్యను అభ్యసించేందుకు రాఘవన్ మాస్టర్ వద్ద చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె తన గురువునే వివాహం చేసుకుంది. ఇప్పుడు వారిద్దరూ కలిసి తరగతులను నడుపుతున్నారు. అమ్మ తన విద్యార్థుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయదు. విద్యార్థులు వారి సామర్థ్యాలకు అనుగుణంగా గురుదక్షిణను వారి తరగతి చివరిలో మాత్రమే చెల్లిస్తారు.
కలరిపయట్టు గురించి
తమిళ సంగం సాహిత్యంలో (300 BCE నుండి 300 CE వరకు) ప్రస్తావించబడిన కలరి, యుద్ధాలు చేయడానికి యుద్ధ రూపంగా యోధులకు బోధించబడింది. ఆ తర్వాత కేరళలోని ఉత్తర, మధ్య భాగం తమిళనాడులోని దక్షిణ భాగంలో పురుషులు మాత్రమే ఈ కళను అభ్యసించేవారు. పురాణాల ప్రకారం, అగస్త్య మహర్షి పరశురాముడితో పాటు దక్షిణ కలరిపయట్టుకు మూలకర్తగా పరిగణించబడ్డాడు.
అనేక శతాబ్దాల పాటు అత్యున్నతంగా ఈ కళ ప్రాచుర్యం పొందింది. తరువాత, ఈ యుద్ధ కళ క్షీణించింది. మీనాక్షి గురుక్కల్ అమ్మ ద్వారా మళ్లీ ఈ కళ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆసక్తి నేర్చుకునేవారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. అదే మీనాక్షమ్మకు ఉత్సాహాన్ని, ఊపిరిని ఇస్తుంది. వారికి విద్య నేర్పుతున్న సమయంలో తన వయసు అసలు గుర్తుకు రాదని చెబుతుంటారు.
కలరిలోని ప్రతి కదలిక చాలా మనోహరంగా ఉంటుంది. అవి సాంప్రదాయ కేరళ నృత్య రూపాలను గుర్తు చేస్తాయి. కేరళ యొక్క సాంప్రదాయ నృత్య రూపాల యొక్క అనేక మంది అభ్యాసకులు ఈ యుద్ధ కళ యొక్క కొన్ని అంశాలను కూడా కలిగి ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com