Delhi Telangana Bhavan: పోలీసుల నుండి తప్పించుకోబోయి 4వ అంతస్తు నుండి కిందపడ్డ నిందితుడు..

Delhi Telangana Bhavan: పోలీసుల నుండి తప్పించుకోబోయి 4వ అంతస్తు నుండి కిందపడ్డ నిందితుడు..
X
Delhi Telangana Bhavan: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రమాదం జరిగింది.

Delhi Telangana Bhavan: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రమాదం జరిగింది. సైబర్‌ క్రైమ్‌లో నిందితుడిగా ఉన్న ఓ నైజిరియన్‌ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 4వ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పైపులు పట్టుకుని పారిపోయే ప్రయత్నం చేయగా... పట్టుజారి పడిపోయాడు. చెట్టు మీద పడటంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్ర గాయాలైన నిందితుడిని.. ఏపీ ప్రభుత్వ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. అంబులెన్సు మొరాయించడంతో నెట్టారు. అయినా స్టార్ట్ కాకపోవడంతో ఆటోలో నిందితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Tags

Next Story