Manipur shocker: తల నరికి కంచెకు వేలాడదీశారు..

Manipur shocker: తల నరికి కంచెకు వేలాడదీశారు..
మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి.. కుకీ వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన దుండగులు... వీడియో వైరల్‌...

మణిపూర్‌లో మరో దారుణం(Manipur shocker) వెలుగుచూసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి(paraded naked), వారిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం దుమారం రేపుతుండగానే.. ఓ యువకుడి తల నరికి వెదురు తడికెకు వేలాడదీసిన ఘటన దేశాన్ని మరోసారి గగుర్పాటుకు గురిచేసింది.

కుకీ తెగ( Kuki man)కు చెందిన డేవిడ్‌ థీక్‌ తల నరికి అందరికీ భయం కలిగించాలన్న ఉద్దేశంతో తడికెకు వెలాడదీసినట్లు పోలీసులు తెలిపారు. విష్ణుపూర్‌ జిల్లాలోని నివాస ప్రాంతంలో జులై 2న అర్ధరాత్రి అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇదే రోజు ఆ ప్రాంతంలో పెద్దఎత్తున ఘర్షణలు జరిగాయి. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు థీక్‌ తలను తడికెకు తగిలించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇది సోషల్‌ మీడియా‍video of chopped head emerges)లో వైరల్‌ అవుతోంది.


జూలై 2న బిష్ణుపూర్ జిల్లాలో అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు చంపారు. డేవిడ్ థీక్ తల నరికి వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. హత్య చేసిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి వారిని నగ్నంగా ఊరేగించిన వీడియో క్లిప్‌ ఈ నెల 19న సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మే 4న జరిగిన ఈ అమానుష సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పార్లమెంట్‌ ఉభయ సభలను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ తరుణంలో కుకీ వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌( horrific video) వైరల్‌ కావడం మణిపూర్‌లో మరింతగా ఉద్రిక్తతలను రాజేస్తున్నది.


ప్రత్యర్థి గ్యాంగ్‌ను భయపెట్టేందుకే ఒక ఎమ్మెల్యే తన సెక్యూరిటీ గార్డుతో ఈ హత్య చేయించాడా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. బిష్ణుపూర్-చురా చంద్ పూర్ జిల్లాల సరిహద్దుల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. జూలై 2 రాత్రి జరిగిన మత ఘర్షణల సమయంలో డేవిడ్ హత్య జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కుకీ, మెయిటీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరో ముగ్గురు కూడా మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story