NEET: తమిళనాడులో ఆరని NEET జ్వాలలు

NEET: తమిళనాడులో ఆరని NEET జ్వాలలు
గ్రామీణ విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేస్తోందన్న విమర్శలు

నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించాలని ఆ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉద్యమం కొనసాగుతోంది. డీఎంకే, దాని మిత్రపక్షాలు వివిధ రకాలుగా నీట్‌ ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. తాజాగా మధురైలో నీట్ పరీక్షను ఎత్తివేయాలంటూ 24 గంటల పాటు నిరాహారదీక్ష చేపట్టారు. నీట్ పరీక్ష కోసం ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్ధులకు నివాళులు అర్పించారు. నీట్ రద్దుపై ప్రభుత్వ తీర్మానాన్ని గవర్నర్ RN రవి వెనక్కిపంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌ను రద్దు చేయాలి.. తమిళనాడు విద్యార్దులను కాపాడాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

విద్యార్థులపై, రాష్ట్ర విద్యావ్యవస్థ మీద ఈ పరీక్ష తీవ్రంగా ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తున్నారు. నీట్‌ కేవలం పట్టణ ప్రాంతాల వారికే అక్కరకొస్తోందని, గ్రామీణ విద్యార్థులను అది వైద్యవిద్యకు దూరం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు నీట్‌ ప్రతిబంధకంగా మారిందన్నది పలువురి వాదన. నీట్‌లో నెగ్గలేక విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారంటూ ఇప్పటికే తమిళనాడులో పలు పార్టీలు నిరసన తెలుపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story