ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం జగన్ సమావేశం

ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం జగన్ సమావేశం

ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాలపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. మోదీ నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా చర్చలు జరిగాయి. విభజన హామీలు, పెండింగ్ నిధులు, ఏపీ ఆర్థిక పరిస్థితిని సీఎం జగన్‌ ప్రధానికి వివరించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు. అటు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చి ఉందంటున్నారు. త్వరలో ఎన్డీయేలో వైసీపీ చేరుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాదాపు ప్రధానితో 8 నెలల తర్వాత జరుగుతున్న భేటీలో సీఎం ప్రత్యేక హోదాపై ప్రధానితో మాట్లాడారా.. కేంద్రం దీనిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదిలావుంటే ప్రధానితో భేటీ ముగిసాక 1-జన్‌పథ్‌కు చేరుకున్నారు సీఎం జగన్. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.

Tags

Next Story