ఐఫోన్ యూజర్లు అప్డేట్ చెయ్యాల్సిందే.. ఎందుకంటే

ఐఫోన్ యూజర్లు అప్డేట్ చెయ్యాల్సిందే.. ఎందుకంటే
హైరిస్క్ వార్నింగ్ జారీ చేసిన ప్రభుత్వం

ఐఫోన్ వాడుతున్నారా అయితే అర్జెంటుగా అప్డేట్ చేయండి. లేదంటే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది జాగ్రత్త. భారతదేశంలోని ఐఫోన్ యూజర్లకు ప్రభుత్త్వం ఈ హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది.

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం దేశంలోని ఐఫోన్ వినియోగదారులకు భద్రత హెచ్చరికలు జారీ చేసింది. తక్షణము ఫోన్లోని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని లేకపోతే హ్యాకర్లు మీ డివైస్ ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకోవచ్చు అంటూ ఒక నివేదిక వెల్లడించింది. అధికారిక వెబ్సైట్లో ఐ ఫోన్ 6s,ఐ ఫోన్ 7 సిరీస్, ఐఫోన్ 8 సిరీస్, ఐఫోన్ SE ఫస్ట్ జన్ లతో సహా పాత మోడల్ కు కూడా ఈ హాని కలిగే అవకాశం ఉందని తెలిపింది. ఐప్యాడ్ ఎయిర్ ప్రో లతో పాటు మినీ వినియోగదారులు కూడా ఐపాడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆపిల్ ఫోన్ల కోసం కొత్త iOS అప్డేట్లను విడుదల చేయడం ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాతే ప్రభుత్వం నుంచి ఈ హెచ్చరిక వచ్చింది. కెర్నల్ వెబ్ కిట్ లోని సమస్యల ఆధారంగా ఆపిల్ ఐఓఎస్, ఐపాడ్ ఐఓఎస్ లకు హాని కలిగే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT -in) పేర్కొంది. ఆపిల్ సఫారీ బ్రౌజర్ లో వెబ్ కిట్ అనేది ఒక కోర్ టెక్నాలజీ. ఒకవేళ దాంట్లో ఏవైనా సమస్యలు ఏర్పడితే హ్యాకర్లు మొబైల్ లక్ష్యంగా దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. భద్రతా సంస్థకు చెందిన పరిశోధకులు ఈ సమస్యలను కనుగొన్నారని ఆపిల్ సపోర్ట్ పేజీ పేర్కోంది. కాబట్టి ఆపిల్ యూజర్లు తక్షణమే అప్డేట్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story