Archana Gautam: మిస్ బికినీ ఇండియాగా గెలిచి.. రాజకీయాల్లో ఓడిపోయింది..

Archana Gautam (tv5news.in)
Archana Gautam: చాలామంది సినీ రంగంలో రాణించిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనుకుంటారు. అలా వచ్చి సక్సెస్ సాధించిన వారు కూడా ఉన్నారు. కానీ అలా వచ్చినవారిలో రాజకీయాల్లో రాణించిన వారికంటే ఓడిన వారే ఎక్కువ. తాజాగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీపడిన ఓ నటికి ఈ విషయం స్పష్టంగా భోదపడినట్టుగా ఉంది.
ముందుగా ఓ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు అర్చనా గౌతమ్. ముందుగా 2014లో మిస్ ఉత్తరప్రదేశ్‌గా టైటిల్‌ను దక్కించుకున్నారు. ఆ తర్వాత మిస్ బికినీ ఇండియాగా టైటిల్ దక్కించుకున్నప్పుడు దేశమంతా ఆమెవైపు తిరిగి చూసింది. కేవలం మోడల్‌గానే కాదు.. నటిగా కూడా అర్చనా పలు సినిమాల్లో మెరిసారు. అంతే కాకుండా త్వరలోనే సౌత్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అర్చనా గౌతమ్.
మోడల్‌గా, నటిగా సక్సెస్‌ఫుల్ అయిన అర్చనా.. రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఉత్తర ప్రదేశ్‌లోని హస్తినాపూర్ నియోకజవర్గం నుండి అర్చనా పోటీ చేశారు. అయితే ఆమెకు కేవలం 1519 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే ఆమెకు మొత్తంగా 0.66 శాతం ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. తన ప్రత్యర్థి, బీజేపీ పార్టీ నేత దినేశ్ ఏకంగా 1.07 లక్షల బంపర్ మెజారిటీతో గెలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com