Plane Crash: భార్య అస్థికలు నర్మదానదిలో కలపడానికి వచ్చి దుర్మరణం..

నెల రోజుల క్రితం తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులకు ఇప్పుడు తండ్రి కూడా దూరమయ్యాడు. భార్య చివరి ఆశను నెరవేర్చేందుకు లండన్ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఓ భర్త, తిరిగి తన పిల్లల దగ్గరకు వెళ్తూ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆ కుటుంబ గాధే ఇది.
లండన్ కేంద్రంగా నివసిస్తున్న అర్జున్ మనుభాయ్ పటోలియా (36), భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం అతని భార్య భారతీబెన్ కన్నుమూసింది. తన అస్థికలను మాతృభూమి భారత్‌లో కలపాలని ఆమె భర్తను చివరి కోరిక కోరింది. దీంతో అర్జున్ ఆమె చితాభస్మాన్ని పట్టుకుని గుజరాత్‌లోని అమ్రెలీ జిల్లాలోని తన పూర్వీకుల గ్రామం వడియాకు వచ్చి నర్మదా నదిలో నిమజ్జనం చేశాడు. అహ్మదాబాద్‌లో విమానం ఎక్కి లండన్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించాడు. వారం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మరణించడంతో లండన్‌లో ఉన్న వారి 4, 8 ఏండ్ల కుమార్తెలు అనాథలుగా మారారు. తల్లి మరణం నుంచి కోలుకోకముందే, తండ్రి కూడా శాశ్వతంగా దూరమవ్వడంతో లండన్‌లోని ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు అనాథలయ్యారు. వారి బాగోగులు ఎవరు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com