India Army : ఇద్దరు స్నేహితుల చేతుల్లో సైన్యాధికారం

లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ మనోజ్ పాండే నేషనల్ వార్ మెమోరియల్ వద్ద యుద్ధ అమరవీరులకు నివాళులర్పించి ఆదివారం ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. అనంతరం తన బాధ్యతలను ఉపేంద్ర ద్వివేదికి అప్పగించారు.
1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న సైన్యంలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే నావికాదళానికి నాయకత్వం వహిస్తున్న అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ, ఉపేంద్ర ద్వివేది చిన్ననాటి స్నేహితులు కావడం గమనార్హం. దృఢమైన స్నేహబంధం కలిగిన ఇద్దరు నాయకులు కలిసి భారత సైనిక దళాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని రక్షణశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఇద్దరి మధ్య స్కూల్ టైమ్ నుంచి చాలా మంచి స్నేహం ఉంది. సైన్యంలోని వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ టచ్‌లో ఉన్నారు. వారి రోల్ నంబర్లు కూడా పక్క పక్కనే ఉండేవి. ఇందులో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రోల్ నంబర్ 931 కాగా, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి రోల్ నంబర్ 938. సైన్యంలోని అధికారుల మధ్య బలమైన స్నేహం సైన్యాల మధ్య మెరుగైన సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఒక రక్షణ అధికారి చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌లో తెలిపారు.army and navy command Dinesh Tripathi Upendra Dwivedi
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com