JAWAN: అదృశ్యమైన జవాన్ సురక్షితమే
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా( Kulgam district)లో అదృశ్యమైన ఆర్మీ జవాన్(Army jawan )ను భద్రతా దళాలు సురక్షితంగా కాపాడాయి. అదృశ్యమైన ఆర్మీ జవాన్‌ను కుల్గామ్ పోలీసులు కనిపెట్టారని ( recovered) కాశ్మీర్ అదనపు జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. జవాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పోలీసులు, ఆర్మీ జరిపే ఉమ్మడి విచారణ త్వరలో ప్రారంభమవుతుందని వివరించారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని భద్రతా దళాలు ప్రకటించాయి. జవాన్ అదృశ్యం గురించి పోలీసులు ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ... అతన్ని ఉగ్రవాదులే అపహరించి ఉంటారని అనుమానిస్తున్నారు.
కుల్గామ్ (Kulgam) జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల జావేద్ అహ్మద్ వానీ (Javed Ahmad Wani) ఇండియన్ ఆర్మీలో (Indian Army) సైనికుడిగా(Soldier) పనిచేస్తున్నాడు. లద్దాఖ్‌లోని (Ladakh) లేహ్‌లో విధులు నిర్వహిస్తున్న వాని సెలవులపై ఇంటికి వచ్చి అదృశ్యమయ్యాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అతని కారును గుర్తించగా అందులో జావేద్ చెప్పులు, సీటుపై రక్తపు మరకలు కనిపించాయి. ఎవరో తమ కుమారుడిని ఎత్తుకువెళ్లారని పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ ముమ్మరంగా గాలింపు చేపట్టి వానీని గుర్తించి రక్షించాయి.
గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. కానీ వానీకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జవాన్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపాయి.
కాశ్మీర్‌లో సెలవులో ఉన్న సమయంలో అదృశ్యమైన నాల్గో సైనికుడు వానీ. 2017మే లో లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను షోపియాన్ జిల్లాలోని అతని మామ ఇంటికి రాగా అక్కడ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. 2018 జూన్‌లో ఔరంగజేబ్ అనే ఆర్మీ సైనికుడిని కూడా హత్య చేశారు. జవాన్ సమీర్ మల్లాను 2022 మార్చిలో కిడ్నాప్ చేసి హత్య చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com