సైన్యాన్ని చుట్టుముట్టిన 1200 మంది మహిళలు.. 12 మంది మిలిటెంట్ల విడుదల

సైన్యాన్ని చుట్టుముట్టిన 1200 మంది మహిళలు.. 12 మంది  మిలిటెంట్ల  విడుదల
మణిపూర్‌లో సైన్యాన్ని చుట్టుముట్టిన 1200 మంది మహిళా బృందం.... 12 మంది మిలిటెంట్ల విడుదల

మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. మణిపుర్ లో హింసకు పాల్పడుతున్న హింసను ప్రేరేపిస్తున్న 12 మంది కంగ్లీ యావోల్ కన్న లుప్ తీవ్రవాద ముఠా సభ్యులను ఇతాం గ్రామంలో నిన్న ఉదయం భద్రతాదళాలు అరెస్టు చేశాయి. వాళ్లను విడుదల చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇథామ్‌ గ్రామంలో ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీని 12 వందల మంది చుట్టుముట్టారు. ఓ మహిళ నేతృత్వంలో 12 వందలమంది.. భారత ఆర్మీని చుట్టుముట్టారు. మహిళల నేతృత్వంలో వందలాది మంది చుట్టుముట్టడం వల్ల ఆర్మీ ఏమీ చేయలేకపోయింది. శనివారం మొత్తం వారు సైన్యాన్ని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే స్థానికుల ప్రాణాలకు ప్రమాదమని భావించిన సైన్యం.. 12 మంది ఉగ్రవాదులను విడుదల చేసింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు సైన్యం అక్కడున్న కమాండర్ ను ప్రశంసించింది.

Tags

Read MoreRead Less
Next Story