ఈడీ సమన్లకు కేజ్రీ ముందే స్పందించి ఉంటే అరెస్టు తప్పేది: అస్సాం సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలుమార్లు సమన్లు విస్మరించినందుకు అరెస్టు చేశారని, ఆయన ఏజెన్సీకి ప్రతిస్పందిస్తే దానిని సులభంగా నివారించవచ్చని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
“ఎవరైనా 8 నుండి 9 సార్లు సమన్లు పంపిస్తే దానిని గౌరవించి ఒకసారి వారి ఎదుట హజరైతే బావుండేది. కానీ కేజ్రీ అలా చేయలేదు. దాంతో అతడు అరెస్టును ఆహ్వానిస్తున్నాడని అర్థం చేసుకుంటారు ఎవరైనా. అతను మొదటిసారి సమన్లు వచ్చినప్పుడే (EDకి) వెళ్లి ఉంటే, అరెస్ట్ అయ్యేవారు కాదని బిస్వా శర్మ అన్నారు.
కేజ్రీవాల్ అరెస్టు తరువాత, ఢిల్లీలో నగరవ్యాప్తంగా AAP నిరసనను ప్రకటించింది. దీనిని 'నకిలీ అరెస్టు'గా పేర్కొంటూ, ఈ అరెస్టు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దారితీసే మలుపు కాగలదని తాము భావిస్తున్నామని ఆప్ పేర్కొంది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లను నిరోధించేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు పారామిలిటరీ సిబ్బంది రంగంలోక దిగింది.
ఇప్పుడు రద్దు చేయబడిన ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మార్చి 21 న అరెస్టు చేసింది. తన అరెస్టును, మార్చి 22న ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేజ్రీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com