Arvind Kejriwal: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'పై కేజ్రీవాల్ కామెంట్స్.. సీఎం ఇంటి ముందు ఉద్రిక్తత..

Arvind Kejriwal: ది కశ్మీర్‌ ఫైల్స్‌పై కేజ్రీవాల్ కామెంట్స్.. సీఎం ఇంటి ముందు ఉద్రిక్తత..
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట BJYM శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట BJYM శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రాజకీయ రచ్చకు కారణమైంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా పై ఢిల్లీ అసెంబ్లీ వేదిక కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో మండిపడ్డ BJYM శ్రేణులు సీఎం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారించటంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే బారికేడ్లను దాటుకుని వెళ్లి బీజేవైఎం శ్రేణులు సీసీటీవీ కెమెరాలు, గేటు ధ్వంసమైంది. BJYM జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో నిరసన చేపట్టారు. కాశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్ని కేజ్రీవాల్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.'దేశంలోని హిందువులను అవమానించినందుకు సీఎం కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని MP తేజస్వీ సూర్య డిమాండ్ చేశారు.

కేజ్రీవాల్ క్షమాపణ చెప్పే వరకు BJYM సెగ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేవైఎం శ్రేణుల ఆందోళనపై ఆప్ నేతలు మండిపడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సీఎం నివాసానికి చేరుకోవడానికి ఢిల్లీ పోలీసులు సహకరించారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద సెక్యూరిటీ బారియర్స్‌ను సంఘ విద్రోహులు ధ్వంసం చేశారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్‌లో తెలిపారు.

ఇది ఇలా ఉంటే 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రానికి భాజపా పాలిత రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇస్తుండడంపై ఇటీవలే కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవచ్చు కదా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో కేజ్రీవాల్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అటు కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story