kejriwal: నేడే కేజ్రీవాల్ రాజీనామా..

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ సక్సేనాతో భేటీ కానున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పేరును సమర్పించనున్నారు. దీనికి ముందు, ఉదయం 11:30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త సీఎం పేరు చర్చించి, ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇకపోతే కొత్త సీఎం ఎవరన్న విషయంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 16న కేజ్రీవాల్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోని సీనియర్ నేతలు, కేబినెట్ మంత్రులందరినీ ఇందులో చేర్చారు. కొత్త సీఎంపై కేజ్రీవాల్ వన్ టు వన్ చర్చలు జరిపారు. అతిషి, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, సునీతా కేజ్రీవాల్ లలో ఎవరైనా ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని సమాచారం.
ఇకపోతే., హర్యానాలో అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకోలేదు. ఇందులో ఆప్ పార్టీ మొత్తం 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కేజ్రీవాల్ దృష్టి అంతా ఇప్పుడు హర్యానా ఎన్నికల ప్రచారంపైనే ఉంది. అంతేకాదు.. కేజ్రీవాల్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com