Arvind Kejriwal: ప్రధాని మోదీ ఇలాకాపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను.. రంగంలోకి కేజ్రీవాల్..

Arvind Kejriwal: ప్రధాని మోదీ ఇలాకాపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను.. రంగంలోకి కేజ్రీవాల్..
Arvind Kejriwal: పంజాబ్‌లో అఖండ విజయంతో ఊపు మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇపుడు ప్రధాని మోదీ ఇలాకాపై కన్నేసింది.

Arvind Kejriwal: పంజాబ్‌లో అఖండ విజయంతో ఊపు మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇపుడు ప్రధాని మోదీ ఇలాకాపై కన్నేసింది. త్వరలో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికలపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో పర్యటించారు. మెహసానాలో భారీగా నిర్వహించిన తిరంగ్‌ యాత్రలో పాల్గొన్నారు.

ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్.. బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటేనే గుజరాత్ ప్రజలు భయపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారని.. గుజరాత్ ఇపుడు మార్పు కోరుకుంటోందన్నారు. మూడు దశాబ్దాలుగా పాలిస్తున్న బీజేపీని గద్దె దింపి గుజరాత్‌లో తమ పార్టీ జెండాను ఎగరవేస్తామని కేజ్రీవాల్ చెప్పారు.

Tags

Next Story