MIM vs BJP: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న ఓవైసీ.. హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ కౌంటర్

MIM vs BJP: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న ఓవైసీ.. హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ కౌంటర్
X
భారత్ హిందూ దేశం, ప్రధానిగా ఎప్పటికీ హిందువే అన్న హిమంత శర్మ..

హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు భారత ప్రధాని కావాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ కామెంట్స్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే, శనివారం నాడు మహారాష్ట్రలోని సోలాపూర్లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఓవైసీ.. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒకే మతానికి చెందిన వ్యక్తే అక్కడ ప్రధాని అవుతాడు.. కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భారత పౌరుడు ఎవరైనా సరే ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చు అని గుర్తు చేశారు. ఇక, హిజాబ్ ధరించిన మహిళా ఈ దేశానికి ప్రధాని అయ్యే రోజు రావాలని నేను కలలు కంటున్నాను అని అసదుద్దీన్ పేర్కొన్నారు.

ఇక, ఎంపీ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. రాజ్యాంగపరంగా ఎవరికీ ప్రధాని కావడంలో అడ్డంకి లేదు.. కానీ భారతదేశం ఒక హిందూ దేశం, హిందూ నాగరికత.. అందుకే భారత ప్రధాని ఎప్పటికీ హిందువే అవుతాడనే విశ్వాసం మాకు ఉందని తెలిపాడు. అలాగే, ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందంటూ ఓవైసీ చెబుతున్నారు.. రాజ్యాంగం ఎవరికీ అడ్డంకి కాదు.. కానీ, ముందు AIMIM పార్టీలోనే ఒక పస్మాందా లేదా హిజాబ్ ధరించిన మహిళను అధ్యక్షురాలిగా చేయండి అంటూ ఎక్స్ (X)లో సవాల్ విసిరారు.

ఇక, హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఆయన తలలో ట్యూబ్‌లైట్ ఉంది.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, రాజ్యాంగంలో లేని మాటలు ఎలా మాట్లాడతారు? అని విమర్శించారు. ఈ దేశం ఒక్క వర్గానికే చెందిందని అనుకునేవారు రాజ్యాంగ ఆత్మను అర్థం చేసుకోలేకపోతున్నారు.. దేవుడిని నమ్మని వారికీ ఈ దేశంలో స్థానం ఉంది.. అదే భారతదేశ సౌందర్యం.. హిమంత మనస్సు చిన్నపిల్లల మనస్తత్వం అని విమర్శించారు. అయితే, ఇరువురి వ్యాఖ్యలతో ముంబై మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మరింత హీటెక్కింది. ఈ ఎన్నికలు జనవరి 15వ తేదన జరగనుండగా, ఫలితాలు జనవరి 16న వెల్లడికానున్నాయి.

Tags

Next Story