Haryana: ఆపరేషన్ సిందూర్‌పై పోస్ట్‌ ప్రొఫెసర్ అరెస్ట్‌

Haryana: ఆపరేషన్ సిందూర్‌పై   పోస్ట్‌ ప్రొఫెసర్  అరెస్ట్‌
X
అశోక వర్సిటీ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ మహ్ముదాబాద్‌ను ఆదివారం అరెస్ట్‌ చేశారు. బీజేపీ యువ మోర్చా నేత ఫిర్యాదుపై ఆయనను ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. అలీ ఖాన్‌ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన పోస్ట్‌లో, ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌ మీడియాకు వివరించడాన్ని మీడియా ఆర్భాటంగా వర్ణించారు. ఈ ఆర్భాటం క్షేత్ర స్థాయిలో వాస్తవ రూపం దాల్చాలని, లేదంటే ఇదంతా కేవలం నయవంచన అవుతుందని పేర్కొన్నారు. ఆయనకు హర్యానా మహిళా కమిషన్‌ కూడా నోటీసులిచ్చింది.

ప్రొఫెసర్ అలీ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు యూనివర్సిటీ నిర్ధారించింది. దర్యాప్తులో పోలీసులకు, అధికారులకు సహకరిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొ్న్నారు. ఇక ప్రొఫెసర్‌కు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసు పంపించింది. నోటీసు ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లకు సెల్యూట్ చేస్తున్నామని.. వారిపై ప్రొఫెసర్ ఉపయోగించిన పదాలకు కమిషన్ ముందు హాజరై విచారం వ్యక్తం చేస్తారని తాము ఊహించినట్లు కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా అన్నారు. అయితే మహిళా కమిషన్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుందని ప్రొఫెసర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. పోస్టులను తప్పుగా చదవి, తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపోయానన్నారు. వాటి అర్థాన్ని తారుమారు చేశారని వాపోయాడు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లో వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. అలాగే సైనికులు చనిపోయారు. ఇక 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Tags

Next Story