Gyanvapi mosque: జ్ఞానవాపిలో రాడార్‌లతో "శాస్త్రీయ సర్వే"

Gyanvapi mosque: జ్ఞానవాపిలో రాడార్‌లతో శాస్త్రీయ సర్వే
X
జ్ఞానవాపి మసీదులో రెండో దశ శాస్త్రీయ సర్వే ప్రారంభం... సహకరిస్తున్న మసీదు కమిటీ...

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ(Archaeological Survey of India) అధికారుల సర్వే మూడో రోజూ కొనసాగుతోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య( heavy police force) తెల్లవారుజామునే మసీదుకు చేరుకున్న శాస్త్రీయ ఆధారాలతో సర్వే‍ ‍(scientific survey‌ కొనసాగిస్తోంది. కోర్టు ఆదేశించిన సర్వే ప్రాథమిక దశ పూర్తయిందని, రాడార్‌లతో సహా యంత్రాల(machines" including radars )తో’ రెండో దశ(secondary stage )ను ఈరోజు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన సర్వే పనులు... ఇవాళ మళ్లీ తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి.


ఇవాళ శాస్త్రీయ సర్వే మరో దశ ప్రారంభం అవుతుందని, ప్రాథమిక దశ పూర్తయిందని, యంత్రాల సాయంతో ఈ సర్వే చేస్తారని జ్ఞానవాపి కేసులో హిందూ తరఫు న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది(Subhash Nandan Chaturvedi) తెలిపారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS)తో సహా అనేక యంత్రాలతో ఇప్పటికే సర్వే పూర్తయిందని, ఇవాళ రాడార్‌లను ఉపయోగించే అవకాశం ఉందని హిందూ తరపు మరో న్యాయవాది సుధీర్ త్రిపాఠి(Sudhir Tripathi) తెలిపారు. శాస్త్రీయ సర్వేపై తాము సంతృప్తి చెందామని, ముస్లిం వైపు నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవని, వారు కూడా సహకరిస్తున్నారని ఆయన వెల్లడించారు. సర్వేకు ఇంతెజామియా మసీదు కమిటీ సహకరిస్తోందని, గతంలో ఇవ్వడానికి నిరాకరించిన తాళంచెవులను కూడా ఇప్పుడు అందజేశారని సుధీర్ త్రిపాఠి చెప్పారు. తాము సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. ఏఎస్‌ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్‌ మిశ్రా, ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు, అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు కూడా సర్వేను పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ శాస్త్రీయ సర్వే పనులకు సహకారం అందిస్తామని ఇంతెజామియా మసీదు కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్‌ యాసీన్‌ లేఖ ద్వారా తెలిపారు.


హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్‌పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్‌ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమర్థించింది. సెప్టెంబర్‌ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అప్పటికే ఉన్న హిందూ ఆలయ కట్టడంపై 17వ శతాబ్దంలో మసీదును నిర్మించారా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ సర్వే ప్రారంభమైంది. తొలిరోజు ముస్లిం ప్రతినిధులు దూరంగా ఉన్నప్పటికీ శనివారం సర్వే సమయంలో ఆ వర్గానికి చెందిన అయిదుగురు సభ్యులు ఏఎస్‌ఐ సిబ్బంది వెంట ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇంతెజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాదులు ఉన్నారు. జ్ఞానవాపి ప్రాంగణంలో పడిన ఉన్న శిథిలాల్లో ప్రతిమల భాగాలు కొన్ని కనిపించాయని హిందువుల న్యాయవాది సుధీర్‌ త్రిపాఠి తెలిపారు. ఏఎస్‌ఐ వినియోగిస్తున్న జీపీఆర్‌ సాంకేతికత వల్ల మసీదు అడుగున ఉన్న నిర్మాణాల వంటి వాటిని ఎలాంటి తవ్వకాలు జరపకుండానే గుర్తించవచ్చని భారత పురావస్తు సర్వే మాజీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ బి.ఆర్‌.మణి తెలిపారు.

Tags

Next Story