Himanta Biswa: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీ

Himanta Biswa: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీ
X
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు

భారత్లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి హిందువులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు.

అయితే.. టెక్స్‌టైల్ రంగంలో ఉపాధి కోసం బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. గత నెలలో 35 మంది ముస్లిం చొరబాటుదారులను అరెస్టు చేశామన్నారు. వారు అస్సాంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ అస్సాంలో నివసించేందుకు కాదని, వారు టెక్స్‌టైల్ పరిశ్రమలో పనిచేయడానికి అని ముఖ్యమంత్రి బిశ్వ శర్మ చెప్పారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుతున్న వారు అస్సాంలో ఆశ్రయం పొందడం లేదని.. బెంగళూరు, తమిళనాడు, కోయంబత్తూరుకు వెళ్లి వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారని హిమంత చెప్పారు. కాగా.. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రధాని మోడీని అభ్యర్థించామని సీఎం చెప్పారు.

ఈ నెల మొదట్లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం గద్దె దించిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ వర్గాలకు చెందిన వారిపై పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుండి 48 జిల్లాల్లో 278 చోట్ల మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై దాడులు జరిగాయని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ మహా కూటమి తెలిపింది.

మరోవైపు హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

Tags

Next Story