Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం

అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం తెల్లవారుజామున (2.25 గంటలకు) అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) పేర్కొంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. దాంతో జనాలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అస్సాం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని ఎన్‌సీఎస్ తెలిపింది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
బంగ్లాదేశ్, భూటాన్, చైనాతో సహా పొరుగు దేశాలలో కూడా భూకంపం సంభవించింది. 5 తీవ్రతతో సంభవించే భూకంపాన్ని మోస్తరుగా పరిగణిస్తారు. అస్సాంలో భూకంపాలు సర్వసాధారణం. ఎందుకంటే ఈ రాష్ట్రం భారతదేశంలోని అత్యధిక భూకంపాలకు గురయ్యే జోన్‌లలో ఒకటి. అస్సాంలోప్రకంపనల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అస్సాంలో భూ ప్రకంపనల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇండోనేషియాలో
ఇదిలా ఉంటే నిన్న (ఫిబ్రవరి 26) ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపం సమీపంలో భూమి వణికింది. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ ఆఫ్‌షోర్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదని పేర్కొంది. ఉదయం 6:55 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే అది 6.0 తీవ్రతతో కొంచెం తక్కువ భూకంపం సంభవించిందని ఇండోనేషియా వాతావరణ సంస్థ (BMKG) తెలిపింది. అంతేకాకుండా ఈ భూకంపం సునామీని ప్రేరేపించే ముప్పు కాదని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతం అనేక విధ్వంసకర భూకంపాలకు గురైంది. జనవరి 2021న సులవేసిలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనికి ముందు 2018లో సులవేసిలోని పాలూలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 2,200 మందికి పైగా మరణించారు.
ఇక 2004లో ఆషే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ సునామీని సృష్టించింది. దీని వల్ల ఇండోనేషియాలోనే 1,70,000 మందికి పైగా మరణించడం విశేషం. అయితే ఇటీవలి భూకంపం తక్షణ నష్టం కలిగించనప్పటికీ, ఇండోనేషియా అధికారులు దీని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని, దేశీయ విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసిన భద్రతా ఆదేశాలను పాటించాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com