Satellite: అస్సాంకు సొంత ఉపగ్రహం

ఇకపై అస్సాం రాష్ట్రానికి సొంత ఉపగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వాశర్మ పేర్కొన్నారు. దేశంలో ఈవిధంగా సొంత ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రాష్ట్రంగా అస్సాం నిలువబోతుందని ఆయన ప్రకటించారు. అస్సాం రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుల కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడనుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ తెలియ జేశారు. 2025-26 ఏడాదికి గానూ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాష్ట్ర సరిహద్దులో బలమైన నిఘా ఉంచేందుకు కూడా ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, సరిహద్దు భద్రతలో ఈ ఉపగ్రహం సేవలు వినియోగించనున్నట్టు తెలిపారు.
"భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన IN-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) సహకారంతో ఈ ఉపగ్రహాన్ని నిర్మించిన్నట్టు సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. కాగా ఇలాంటి ప్రయోగాత్మక ఉపగ్రహాలను నిర్మించడం వలన విద్యార్థుల్లో ఉపగ్రహాల పట్ల, అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి నెలకొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ లో ఇస్రోతోపాటు ఇండియన్ ఆర్మీ మాత్రమే ఇప్పటి వరకు సొంత ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com