Astrologer Trap: వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ జ్యోతిష్యుడు నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద బ్రతకలేవు అంటూ విద్యాజ్యోతికి చెప్పడంతో ఆందోళనకు గురైంది. 9 రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతావని జ్యోతిష్యుడు చెప్పినందుకు భయపడి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరు – యశ్వంతపురలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తూ, 9 రోజుల క్రితమే ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకున్న విద్యాజ్యోతి(29) అనే యువతి. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నది. ఇటీవల విద్యాజ్యోతికి నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద బ్రతకలేవు అంటూ భయపెట్టాడు ఓ జ్యోతిష్యుడు. తొమ్మిది రోజులు పూజలు చేసి, ఆఖరి రోజైన శుక్రవారం తాళి తీసి అమ్మవారికి సమర్పించు. ఆపై నీకు మంచి జరుగుతుందని జ్యోతిష్యుడు ఆమెకు చెప్పాడు.
జ్యోతిషుడి మాటలు విని 9 రోజుల పూజలు చేసింది. చివరి రోజు అమ్మవారికి తాళి తీసివ్వడానికి ముందు గదిలోకి వెళ్ళి, తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యాజ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. జ్యోతిషుడు కరెక్టుగా చెప్పాడా? లేదా ఆమె జ్యోతిషుడు మాట నిజం చేయాలని చనిపోయింది కావచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐటీ జాబ్ చేస్తూ ఇలాంటివి నమ్మడం ఏంటని కొందరు, ఆ జ్యోతిష్యుడిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
