Train Accident : జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం..

Train Accident : జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం..
ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. 12 మంది దుర్మరణం!

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ రైలు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జంతారా-కర్మతాండ్ దగ్గర బుధవారం ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న భగల్‌పూర్ వెళ్లే అంగ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు పక్కనున్న రైలు పట్టాలపైకి దూకారు. అయితే అదే సమయంలో ఝంఝా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ అదే మార్గంలో రావడంతో రైలు కింద పడి తునాతునకలయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది, రైల్వే పోలీసులు హుటాహుటిన తరలివెళ్లారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి వైద్య బృందాలు, అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి.

ప్రయాణికులు పట్టాలు దాటుతున్న అదే సమయంలో మరో రైలు దూసుకొచ్చి వారిని ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైలు ఢీకొనడంతో ప్రయాణికులంతా గాల్లోకి ఎగిరిపడ్డారని, చాలామంది అక్కడిక్కడే మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

స్థానికులు సమాచారం అందించగానే పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలు, గాయపడినవారి కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం చీకటిగా ఉండటంతో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

విద్యాసాగర్, కసితార్ మధ్య ప్రయాణిస్తున్న రైలు నంబర్ 12254 సాయంత్రం 7 గంటలకు అసన్‌సోల్ డివిజన్‌లో ఆగినప్పుడు ఈ సంఘటన జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన జాగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తూర్పు రైల్వే సీపీఆర్వో కౌశిక్ మిత్రా తెలిపారు.

చనిపోయిన వారి మృతదేహాలను సేకరించి మార్చురీలకు పంపిస్తున్నారు. అయితే ప్రమాదం సాయంత్రం కాగా.. అక్కడికి రెస్క్యూ బృందాలు వెళ్లేసరికి చీకటి కావడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. దీంతో మృతదేహాలు, గాయపడిన వారిని వెలికి తీసేందుకు సమయం పడుతోంది. ఇక రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే.. ఆ రైలులో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారి యోగక్షేమాల కోసం ఘటనాస్థలికి చేరుకుంటున్నారు.

Tags

Next Story