అయోధ్య: 108 అడుగుల అగరబత్తి.. 50 కిలోమీటర్ల మేర సువాసన వ్యాప్తి

జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశమంతా రామనామ కీర్తనలతో భక్తులంతా తన్మయత్వం పొందుతున్నారు. అయోధ్య నుంచి వచ్చే ఒక్కో వార్త ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా స్వామి వారి ముందు వెలిగించే అగర్ బత్తీ గురించి తెలియజేస్తుంది.
ఆవు పేడ, నెయ్యి, పూల పదార్దాలు, మూలికల మిశ్రమంతో తయారు చేసిన అగరుబత్తీని ఈ రోజు వెలిగించారు. అయోధ్యలో మహా రామమందిర వైదిక కర్మలు ఈరోజు ప్రారంభం కాగానే శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ గుజరాత్ నుంచి తీసుకొచ్చిన 108 అడుగుల అగరుబత్తీని వెలిగించారు. భారీ అగరుబత్తీ నుంచి వెలువడే సువాసన 50 కిలోమీటర్ల మేర వ్యాపిస్తుందని చెప్పారు. 3,610 కిలోల బరువు, సుమారు మూడున్నర అడుగుల వెడల్పుతో గుజరాత్‌లోని వడోదరలో తయారు చేసిన అగరు బత్తీ ఇది. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు అగరబత్తులు రవాణా చేయబడ్డాయి.
అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూను అందజేయనున్నారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన పవిత్ర మట్టిని ఝాన్సీ, బితూరి, యమ్నూత్రి, చిత్తోర్‌గఢ్, హల్దిగతి మరియు గోల్డెన్ టెంపుల్‌తో సహా వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చారు.
సాంప్రదాయ నాగరా శైలిలో నిర్మించిన రామాలయ సముదాయం 380 అడుగుల పొడవు మరియు 250 అడుగుల వెడల్పుతో విస్తరించి 161 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది 392 స్తంభాలు, 44 గేట్లతో అద్భుతమైన అమరికతో ఒక్కొక్కటి 20 అడుగుల ఎత్తులో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com