Ayodhya airport: డిసెంబర్ 15నాటికి అయోధ్య ఎయిర్‌పోర్ట్ ఫేజ్-1
అయోధ్యలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశ పనులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయని యూపీ సీఎం ఆదిత్యనాథ్ తెలిపారు. ఇక్కడ నిర్మితమవుతున్న మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్‌లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా విమానాశ్రయ మొదటి దశ జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కంటే నెల ముందే పూర్తవుతాయని చెప్పారు. అతి త్వరలోనే రెండో దశ నిర్మాణానికి అనుమతి వస్తుందని తెలిపారు.
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ పూర్తికానుంది. రామమందిర ప్రారంభానికి నెలరోజుల ముందే అంటే డిసెంబర్ 15 నాటికి ఎయిర్‌పోర్టు తొలి దశ పూర్తవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదిత్యనాథ్ శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన విమానాశ్రయ నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని, డిసెంబర్ 15 నాటికి తొలి దశ పూర్తి చేస్తామని చెప్పారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయమంత్రి వికె సింగ్‌తో కలిసి విమానాశ్రయాన్ని సందర్శించిన సిఎం ప్రధాని మోడీ దార్శనికతకు అనుగుణంగా విమానాశ్రయం రూపుదిద్దుకుంటోందని అన్నారు. కాగా విమానాశ్రయంలో అయోధ్యసాంస్కృతిక నైతికత ప్రతిబింబించేలా కృషి చేశామని కేంద్రమంత్రి సింధియా చెప్పారు.గంటకు 2 3 విమానాలను నిర్వహించగల సామర్థంలో 65వేల చదరపు అడుగుల టెర్మినల్ మొదటి దశ నిర్మాణంలో ఉంది.
తొలి విడతలో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విమానాశ్రయం అందుబాటులోకి రానుందని సింధియా తెలిపారు. గంటకు రెండు మూడు విమానాలను హ్యాండిల్ చేయగలదన్నారు. 2,200 మీటర్ల పొడవైన రన్వే అందుబాటులోకి రానుందని, దీంతో బోయింగ్ 737, ఎయిర్బస్ 319, 320 విమానాలు ఇక్కడ ల్యాండ్ అవ్వగలవని చెప్పారు. రెండో ఫేజ్ కోసం త్వరలో కేబినెట్ ఆమోదం తీసుకోనున్నట్లు చెప్పారు. రెండో దశ పూర్తయ్యిందని, రన్వే పొడవు 3700 మీటర్లకు పెరుగనుందని తెలిపారు. అప్పుడు బోయింగ్ 787, బోయింగ్ 777 వంటి పెద్ద విమానాలు కూడా అయోధ్య విమానాశ్రయంలో దిగ గలవని సింధియా చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com