శరవేగంగా అయోధ్య రామమందిరం పనులు

శరవేగంగా అయోధ్య రామమందిరం పనులు
X
అక్టోబర్‌ కల్లా మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందన్నారు నిర్మాణ కమిటీ ఛైర్మన్‌

యూపీలోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్‌ కల్లా మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందన్నారు నిర్మాణ కమిటీ ఛైర్మన్‌. ప్రస్తుతం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. మూడంత స్తుల ఆలయ నిర్మాణంలో భాగంగా రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్‌ నుంచి తెచ్చిన రాతిని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్థంభాలతో నిర్మిస్తున్నారు. బరువు, వాతావరణపరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్థంబాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా భక్తుల దర్శనార్థం రామ మందిరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ భావిస్తోంది.

Tags

Next Story