Ayodhya: దీపోత్సవం రోజు అయోధ్య రాముడిని దర్శించుకున్న 2లక్షల మంది

Ayodhya: దీపోత్సవం రోజు అయోధ్య రాముడిని దర్శించుకున్న 2లక్షల మంది
ట్రయల్ రన్ సక్సెస్ అంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

ఉత్తర్ప్రదేశ్‌లోని అయోధ్య రాముడి దర్శనానికి భారీగా తరలివచ్చే భక్తులను సమన్వయం చేయడానికి ట్రయల్స్లో భాగంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం విజయవంతమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. నవంబర్ 11న నిర్వహించిన దీపోత్సవానికి 2లక్షల మంది భక్తులు హాజరైనట్లు తెలిపింది. నవంబర్ 10 నుంచి 14 వరకు ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులు లక్షల్లో పాల్గొన్నట్లుగా పేర్కొంది. దీపోత్సవం రోజునే ఏకంగా 2 లక్షల మందికిపైగా ప్రజలు శ్రీరాముడిని దర్శించుకున్నారని విశ్వహిందూ పరిషత్ మీడియా ఇంఛార్జ్ శరద్ శర్మ వెల్లడించారు.

జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యే లక్షలాది భక్తులను సమన్వయం చేసుకోవడానికి ట్రయల్గా దీపోత్సవం నిర్వహించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా రాముడిని దర్శించుకొని వెళ్లేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. బృందాలుగా ఏర్పడిన రామభక్తుల సాయంతో.. సాధారణ ప్రజలకు సులువుగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వివిధ చెక్పాయింట్లను ఏర్పాటు చేసి... ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా క్యూలైన్లో భక్తులను రాముడిని దర్శనానికి పంపించారు. దీపోత్సవానికి వచ్చిన భక్తుల సంఖ్య ఆధారంగా రానున్న రోజుల్లో ఎంతమంది వస్తారనే అంచనాకు వచ్చి మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

వచ్చే ఏడాది జనవరిలో జరిగే అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రముఖులతో పాటు అనేక మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది శ్రీరామ జన్మభూమి ట్రస్టు. వీరికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది.


మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య నగరం రామయ్య జన్మ భూమి మాత్రమే కాదు ఇక్కడ రాముడి తో పాటు అనేక మంది దేవతలు ప్రతి రోజూ పూజలను అందుకుంటారు. అయితే యమధర్మ రాజుకి గుడులున్నవి తక్కువే.. పూజించేది కూడా అరుదే.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పూజిస్తారు. మనిషి ఆయుస్సుని, తప్పు ఒప్పులను లెక్కించే జీవుల మరణాన్ని నిర్ణయించే యమ ధర్మ రాజుకి అయోధ్యలో భక్తులు ప్రత్యేక పూజ చేస్తున్నారు. ఏడాదిలో ఒక సారి దీపావళి తర్వాత వచ్చే ద్వితీయ తిథి రోజున యమధర్మ రాజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. యముడు కాలానికి దేవుడిగా భావించి పూజిస్తారు.

అయోధ్యాపురిలోని సరయు నదీ తీరంలో యమతారా ఘాట్‌ వద్ద యమధర్మరాజు ఆలయం ఉంది. ఈ ఆలయానికి రోజూ ఉండే భక్తుల రద్దీ కంటే యమ ద్వితీయ రోజున భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన యమ ధర్మ రాజుకి పూజలు చేయడం ద్వారా భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. అంతేకాదు దీర్ఘాయుష్షు ప్రసాదించమని వేడుకుంటారు.


Tags

Read MoreRead Less
Next Story