Ayodhya Ram Mandir: జనవరిలో ‘ప్రాణ ప్రతిష్ట’

Ayodhya Ram Mandir:  జనవరిలో  ‘ప్రాణ ప్రతిష్ట’
అయోధ్య రామాలయ నిర్మాణం.. డిసెంబర్ చివరికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి

భారతదేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా హిందువుల కళలు నిజం కానున్నాయి. అయోధ్యలోని రాముడి ఆలయం ప్రారంభామ కోసం వారు చేస్తున్న నిరీక్షణ త్వరలోనే ముగియనుందని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మూడంతస్తుల రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తామని, జనవరి 22న సంపోక్షణ కార్యక్రమాన్ని నిర్మిస్తామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 15 నుంచి జనవరి 25వరకు పూజలు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. అయితే, 2024 జనవరి 20 నుంచి 24 తేదీల మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. అయితే, ప్రధాని ఏ రోజున స్వామివారి సేవలో పాల్గొంటారన్న అంశంపై పీఎంవో నుంచి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందని చెప్పారు.


ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయాన్ని జనవరి 22న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మందిర నిర్మాణకమిటీ ఛైర్మన్ నృపేంద్రమిశ్రా చెప్పారు. డిసెంబరు చివరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తవుతాయని, జనవరి 20-24 మధ్య జరిగే విగ్రహ ప్రతిష్ఠ, ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారని వెల్లడించారు. ఏటా రామనవమి నాడు గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయం శిఖరంపై ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ నిపుణులు బెంగళూరులో దీన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రూర్కీ, పుణెలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సంయుక్తంగా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.


అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ట్రస్ట్ ద్వారా రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టులో 2019లో మార్గం సుగమం అయిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతరువాత రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరాయి. జనవరి 14న మకర సంక్రాంతి తరువాత రామలల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజులపాటు రామ్‌లల్లాకు ప్రాణ్ ప్రతిష్ట (పవిత్రం) నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. రామ్ లాలా విగ్రహ ప్రతిష్టాపన అనంతరం జనవరి 24న అయోధ్యలోని రామాలయాన్ని భక్తులకోసం తెరిచే అవకాశం ఉందని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ నిర్మాణ కమిటీ భావిస్తుంది. అలాగే ఆలయం వద్దకురాలేని ప్రజలకోసం ఇంటి నుంచే వీక్షించేలా ‘ప్రాణ ప్రతిష్టా’ కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది.

మరోవైపు 136 సనాతన్ సంప్రదాయాలకు చెందిన 25000 మంది హిందూ మత పెద్దలను పవిత్రోత్సవానికి ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తోంది. ముడుపులకు హాజరయ్యే 25వేల మంది సాధువులతో పాటు, పదివేల మంది ప్రత్యేక అతిథులు కూడా ఉంటారు.

Tags

Next Story