అయోధ్య రామమందిరం అతిపెద్ద భూకంపాన్ని తట్టుకుంటుంది: నిపుణులు

అయోధ్య రామమందిరం 2500 సంవత్సరాలలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకుంటుంది అని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అయోధ్య రామ మందిరం యొక్క మొత్తం నిర్మాణం చాలా పటిష్టంగా తయారు చేయబడింది. కట్టడం చాలా బలంగా ఉంది. ఇది 2500 సంవత్సరాలకు ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకోగలదు అని వివరించారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామమందిరాన్ని జనవరి 23, 2024న సామాన్య ప్రజల కోసం తెరిచినప్పటి నుండి లక్షలాది మంది భక్తులు దైవ స్థలానికి తరలివస్తున్నారు. ప్రతి రోజు భారీ జనసందోహం ఆలయాన్ని సందర్శిస్తున్నారు. దీంతో అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉన్నాయి.
అయోధ్య రామ మందిర నిర్మాణం మొత్తం ఎలాంటి ఉక్కు ఉపయోగించకుండా బంసీ పహర్‌పూర్ ఇసుకరాయితో నిర్మించబడింది. శాస్త్రవేత్త ప్రకారం ఇది వెయ్యి సంవత్సరాల జీవితకాలం కోసం రూపొందించబడింది. తాజా వార్తల ప్రకారం ఆలయంలో నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, ఈ నిర్మాణం 2,500 సంవత్సరాలకు ఒకసారి కనిపించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకోగలదు అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com