AYODHYA: శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సమయం ఎప్పుడంటే..?

AYODHYA: శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సమయం ఎప్పుడంటే..?
ప్రాణ ప్రతిష్టకు కర్తలుగా 14 జంటలు... మోదీ సహా ఏడు వేలమంది అతిథులు

అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసం రామజన్మభూమి.. అందంగా ముస్తాబైంది. ఈనెల 16 నుంచి నిర్వహిస్తున్న క్రతువులు సోమవారం ఉదయం కల్లా పూర్తి కానున్నాయి. సరిగ్గా మధ్యాహ్నాం 12 గంటల20 నిమిషాల శుభముహూర్తానికి అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై..దాదాపు ఒంటిగంటకు పూర్తికానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సాధుసంతువులు, ప్రముఖులు కలిపి.... ఏడు వేల మంది అతిథులు... ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 జంటలు ప్రాణప్రతిష్టకు ఆతిథేయులుగా వ్యవహరించనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి..వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరాముడి భవ‌్యమందిరాన్ని.... జీ+2 పద్దతిలో నిర్మించారు.


భక్తులు తూర్పున 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి చేరుకునేలా....... ఏర్పాటు చేశారు. ఆలయ సముదాయాన్ని ఆధునికంగా తూర్పు నుంచి పశ్చిమానికి 380 అడుగులతో సంప్రదాయ నగర విధానంలో నిర్మించారు. 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తున భవ్య మందిరం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున......... మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లతో నిర్మించారు. ఆలయంలో మరో అంతస్తు నిర్మించాల్సి ఉందని...శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ట్రెజరర్‌ గోవింద్ దేవ్ గిరి... చెప్పారు. ఇప్పటివరకూ రామమందిర నిర్మాణానికి 11 వందల కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి.... మరో 300 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఆలయంలోకి....... తూర్పు నుంచి ప్రవేశం, దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ద్వారం ఏర్పాటు చేసినట్లు.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్ చెప్పారు.


మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజ్ తీర్చిదిద్దిన 51అంగుళాల ఎత్తైన..... బాల రాముడి విగ్రహాన్ని ఇప్పటికే గర్భగుడిలో..కొలువుదీర్చారు. కోర్టు సహా పలు వివాదాల కారణంగా అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉన్న రామ్‌ లల్లా విరాజ్‌మాన్‌ విగ్రహాన్ని..భవ్య మందిరంలో..... నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు. రామ్‌ లల్లా విరాజ్‌మాన్‌ విగ్రహం ఐదు నుంచి ఆరు అంగుళాలు మాత్రమే ఉంటుందని 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి వీక్షించడం భక్తులకు సులభం కాదనిశ్రీరా మజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ట్రెజరర్‌ గోవింద్ దేవ్ గిరి చెప్పారు. ప్రాణప్రతిష్ఠ కోసం........ అయోధ్య రామాలయాన్ని వైవిధ్యమైన పూలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.

Tags

Read MoreRead Less
Next Story