Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌
X
గుహలో వేడి వల్ల క్రమంగా కరిగిపోతున్న మంచు శివలింగం..

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. బాల్తాల్ , పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్రికుల భద్రత నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు.

జమ్ము కశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే, తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక న్యూస్ వినిపిస్తుంది. అమర్‌నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి వల్ల మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వల్ల ఈరోజు (శనివారం) అమర్‌నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే ఈ యాత్ర స్టార్ట్ కానుందని సంబంధిత అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్‌ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.

అయితే, తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోతుండటంతో యాత్రికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెప్పుకొచ్చారు. యాత్ర స్టార్ట్ అయినా.. 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటు ఇలా జరిగిందిన్నారు. ఈ సంవత్సరం అమర్‌నాథ్‌ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీన ముగియనుంది.

Tags

Next Story