Baba Siddique: ‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ కూడా ’

మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎన్సీపీ నేత జీషాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. సిద్ధిఖినీని చంపినట్లుగానే చంపేస్తామంటూ మెయిల్ చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. అక్టోబర్ 12న ముంబైలోని తన కుమారుడు కార్యాలయంలో ఉండగా దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు జీషాన్‌కు బెదిరింపు వచ్చింది. మీ తండ్రిని చంపినట్లే చంపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్షదీప్ గిల్‌ను పంజాబ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్ అని పోలీసులు తేల్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com