విస్తారా చిన్నారి.. ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన..

దేవుడు ఎందుకు పుట్టిస్తాడో.. పుడుతూనే ఎందుకు ఇబ్బంది పెడతాడో.. పాపం ఆ రెండేళ్ల చిన్నారి ఏం చేసిందని పుట్టుకతోనే గుండె లోపం.. నిన్న విస్తారా విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీ వెళుతుండగా శ్వాస అందక ఇబ్బంది పడింది. అదృష్టం కొద్దీ విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్లు పాప ప్రాణాలు కాపాడారు అత్యవసర చికిత్స అందించి.. విమానాన్ని అత్యవసరంగా నాగపూర్ లో ల్యాండ్ చేసి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఇప్పుడు చిన్నారి మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైన ఉంది.
నాగ్‌పూర్‌లోని ఒక ఆసుపత్రిలో ఉన్న చిన్నారి పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. ఆగస్ట్ 27 అర్థరాత్రి బెంగళూరు నుండి ఢిల్లీకి వెళుతున్న విస్తారా విమానంలో చిన్నారి ప్రయాణిస్తోంది. AIIMS ఢిల్లీకి చెందిన ఐదుగురు వైద్యులు పాపకు చికిత్స అందించారు. ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ యొక్క కాన్ఫరెన్స్ నుండి వైద్యులు తిరిగి వస్తున్నారు. విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో బాలికను అక్కడి ఆసుపత్రికి తరలించారు.
ఐదుగురిలో ఒకరు అనస్థీషియా డాక్టర్ కాగా మిగిలిన వారు కార్డియాక్ రేడియాలజిస్టులు. విమానంలో ఉన్న వైద్యులు పాప ప్రాణాలను రక్షించే చర్యలను వెంటనే ప్రారంభించారు" అని నాగ్‌పూర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో ఎయిర్‌లైన్ బృందం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం అధికారులతో సమన్వయం చేసుకుని ల్యాండ్ అయిన వెంటనే అంబులెన్స్ రెడీగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com