Arpita Mukherjee: నటి నుండి మంత్రి సన్నిహితురాలి వరకు.. ఎవరీ అర్పితా ముఖర్జీ..?

Arpita Mukherjee: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న 20 కోట్ల రూపాయల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈ మొత్తం లభించింది. దీంతో అసలు అర్పితా ముఖర్జీ ఎవరు అనే ప్రశ్నలు మొదదలయ్యాయి.
ఒడిశా సినీ పరిశ్రమలో మోడల్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది అర్పితా ముఖర్జీ. బెంగాలీ మాత్రమే కాదు.. ఎన్నో తమిళ చిత్రాల్లో కూడా అర్పితా నటించింది. బెంగాలీ సినిమాల్లో సహాయ నటిగా పేరు తెచ్చుకుంది. సౌత్ కోలకత్తాలోని ఓ విలాసవంతమైన ఇంట్లో జీవిస్తోంది అర్పితా. అయినా ఎన్నోసార్లు తను.. పార్థా ఛటర్జీ నియోజకవర్గంలో క్యాంపెయిన్‌లో పాల్గొంది.
ఇక అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ చేసిన తనిఖీల్లో నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆరోపణలకు ఇవే ఆధారాలని ప్రజలు భావిస్తున్నారు. మరి పార్థా ఛటర్జీపై నేర నిరూపణ అవుతుందా లేదా, తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వేచిచూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com