బ్యాగ్ బరువు తగ్గించండి.. ఒక రోజు నో బ్యాగ్ డే పాటించండి: రూల్స్ పాస్ చేసిన ప్రభుత్వం

బ్యాగ్ బరువు తగ్గించండి.. ఒక రోజు నో బ్యాగ్ డే పాటించండి: రూల్స్ పాస్ చేసిన ప్రభుత్వం
పాఠశాల బ్యాగ్ బరువు గరిష్టంగా విద్యార్థుల బరువులో 15 శాతానికి మించకూడదని ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం.

పాఠశాల బ్యాగ్ బరువు గరిష్టంగా విద్యార్థుల బరువులో 15 శాతానికి మించకూడదని ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఖచ్చితంగా పాటించాలని కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను కోరింది. రాష్ట్రంలోని పాఠశాలలు స్కూల్ బ్యాగ్ మార్గదర్శకాలను అనుసరించాలని కోరుతూ సర్క్యులర్‌ను మళ్లీ విడుదల చేసింది. ఈ ఆర్డర్‌ను ఖచ్చితంగా అమలు చేసేలా విద్యా అధికారులను కోరింది.

సర్క్యులర్ ప్రకారం, పాఠశాల బ్యాగ్ గరిష్టంగా అనుమతించబడిన బరువు విద్యార్థి బరువులో 15 శాతానికి మించకూడదు. మార్గదర్శకాల ప్రకారం, 1-2 తరగతి పిల్లల బ్యాగ్‌లు 1.5-2 కిలోలు, 3 నుంచి 5వ తరగతి పిల్లల బ్యాగు బరువు 2-3 కిలోలు ఉండాలి. 6-8 తరగతి బ్యాగు 3-4 కిలోలు, 9-10 తరగతులకు 4-5 కిలోలు ఉండాలి. అంతేకాకుండా, పాఠశాలలు వారానికి ఒకసారి 'నో బ్యాగ్ డే'ని జరుపుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రధానంగా శనివారం దీనిని అమలు పరచాలి అని కోరింది.

డాక్టర్ వీపీ నిరంజనారాధ్య కమిటీ సూచనల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ బ్యాగ్ బరువు వల్ల పాఠశాల విద్యార్థులపై ఆరోగ్యపరమైన ప్రభావాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కొన్నేళ్ల క్రితం ఏర్పాటైన ఈ కమిటీ 2018-19లో తుది నివేదికను సమర్పించింది. తిరిగి 2019లో, కమిటీ తుది నివేదికను సమర్పించినప్పుడు, కర్ణాటక ప్రభుత్వం పాఠశాల బ్యాగ్ బరువు పిల్లల బరువులో 10 శాతానికి మించకుండా చూసుకోవాలని పాఠశాలలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విద్యార్థులు ప్రతిరోజూ తీసుకువెళ్లే భారీ స్కూల్ బ్యాగ్‌ల సమస్యను పరిష్కరించే ప్రమాణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story