BANGLADESH: బంగ్లాదేశ్లో కొనసాగుతున్న దాడులు

బంగ్లాదేశ్లో రాజకీయ సెగలు మళ్లీ మొదలయ్యాయి. షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, 'ఇంక్విలాబ్ మంచ్' పార్టీ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణవార్త ఆ దేశాన్ని నిప్పులకొలిమిలా మార్చింది. హైది మృతితో ఆగ్రహించిన నిరసనకారులు రాజధాని ఢాకాతో పాటు పలు నగరాల్లో విధ్వంసానికి దిగారు. ఈ క్రమంలో భారత దౌత్య కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరగడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందలాది మంది ఆందోళనకారులు కార్యాలయాన్ని చుట్టుముట్టి భారత్కు వ్యతిరేకంగా, అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా హోరెత్తేలా నినాదాలు చేశారు. హైదిపై జరిగిన కాల్పుల వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ దౌత్య కార్యాలయం వెలుపల బైఠాయించారు. దీనితో సరిహద్దు దేశాల మధ్య దౌత్యపరమైన చిక్కులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. నిరసనకారుల ఆగ్రహం మీడియా సంస్థలపై పడింది. ఢాకాలోని ప్రఖ్యాత 'డెయిలీ స్టార్' పత్రికా కార్యాలయంపై అల్లరిమూకలు దాడి చేసి నిప్పు పెట్టారు. రెండు అంతస్తులు అగ్నికీలల్లో చిక్కుకోగా, 25 మంది జర్నలిస్టులను అతి కష్టమ్మీద రక్షించింది.
అసలు కుట్ర ఇదే..
మనం ప్రాణదానం చేసి విముక్తి కల్పించిన బంగ్లాదేశ్లో ఇప్పుడు మళ్లీ భారతదేశానికి వ్యతిరేకంగా విషపు విత్తనాలు నాటుతున్నారు. ఫిబ్రవరిలో జరగబోయే బంగ్లాదేశ్ ఎన్నికలు, షేక్ హసీనా నిషేధం తర్వాత, భారత జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన మలుపు కానున్నాయి. 'గ్రేటర్ బంగ్లాదేశ్' అనే ప్రమాదకరమైన కల... భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర భూభాగాలను కలిపి ఏర్పాటు చేయాలని విస్తరణవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ప్రచారకర్త అయిన షరీఫ్ ఉస్మాన్ హదిపై ఢాకా వీధుల్లో కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిని ఇప్పుడు BNP, దాని మిత్రపక్షాలైన జమాతే ఇస్లామీ రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నాయి. వారు హదిని 'బలిపశువుగా' చిత్రీకరిస్తూ, రాడికల్ ,భారత వ్యతిరేక శక్తుల సానుభూతిని కూడగట్టుకుంటున్నారు. హదిని కాల్చిన అనుమానితుడు ఫైజల్ కరీం మసూద్ తలపై తాత్కాలిక ప్రభుత్వం 50 లక్షల BDT రివార్డు ప్రకటించినప్పటికీ, BNP దీన్ని 'ఎన్నికల విధ్వంసానికి పన్నిన కుట్ర'గా ఆరోపిస్తోంది. ఉల్ఫా వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ మళ్లీ స్వర్గధామం అవుతుందనే చికాకు భారతగూఢచార సంస్థలను వెంటాడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

