బంగ్లాదేశ్ మహిళ.. భర్త కోసం నోయిడాకు..

బంగ్లాదేశ్ మహిళ.. భర్త కోసం నోయిడాకు..
బంగ్లాదేశ్ ఢాకా నివాసి సోనియా అక్తర్‌ బిడ్డతో సహా నోయిడా వచ్చింది.

బంగ్లాదేశ్ ఢాకా నివాసి సోనియా అక్తర్‌ బిడ్డతో సహా నోయిడా వచ్చింది. తనను నోయిడాకు చెందిన సౌరభ్ కాంత్ తివారీ వివాహం చేసుకున్నాడని, అతడిని వెతుక్కుంటూ వచ్చానని పోలీసులకు తెలిపింది.

ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆశ్రయించిన బంగ్లాదేశ్ మహిళ నోయిడాలో నివసిస్తున్న తన భర్తతో కలిసి జీవించాలనుకుంటున్నానని తెలిపింది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఢాకాలో తనను వివాహం చేసుకున్న తర్వాత తనను విడిచిపెట్టాడని చెప్పింది.

"అతను ఇప్పుడు తనను అంగీకరించడం లేదని, తన ఇంటికి తీసుకెళ్లడం లేదని పేర్కొంది. నేను బంగ్లాదేశస్తురాలిని. మూడు సంవత్సరాల క్రితం మాకు వివాహం జరిగింది. నేను నా భర్తతో మాత్రమే ఉండాలనుకుంటున్నాను" అని అంటోంది. సోమవారం పోలీసులు ఆమెకు ఎస్కార్ట్‌గా ఉన్నారు.

ఆమె ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. "బంగ్లాదేశ్ జాతీయురాలు ఇక్కడ సూరజ్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న సౌరభ్ కాంత్ తివారీని వివాహం చేసుకున్నట్లు ఇక్కడి మహిళా పోలీస్ స్టేషన్లో తెలియజేసింది. వివాహానంతరం ఆమెను విడిచిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చాడు.తివారీకి ఇదివరకే వివాహమైందని సోనియా పేర్కొంది" .

మహిళ తన బంగ్లాదేశ్ పౌరసత్వ కార్డుతో పాటు తన మరియు తన బిడ్డకు సంబంధించిన వీసా, పాస్‌పోర్ట్ వివరాలను పోలీసులకు అందించింది. సౌరభ్ కాంత్ తివారీ బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఒక ప్రైవేట్ సంస్థలో జనవరి 4, 2017 నుండి డిసెంబర్ 24, 2021 వరకు పనిచేశాడు. అక్కడే అతడికి సోనియా అక్తర్ పరిచయం అయింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారు ఏప్రిల్ 14, 2021న ఇస్లామిక్ పద్దతిలో వివాహం చేసుకున్నారు. అతడికి అప్పటికే ఒక భారతీయ మహిళతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

గ్రేటర్ నోయిడాలో ఉంటున్న తన ప్రేమికుడితో కలిసి జీవించేందుకు నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్‌ను నోయిడా పోలీసులు అరెస్టు చేసిన నెలన్నర తర్వాత ఈ సంఘటన తెరపైకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story