Sheikh Hasina: షేక్ హసీనాపై రెండోసారి అరెస్ట్ వారెంట్ జారీ..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై సోమవారం బంగ్లాదేశ్ కోర్టు రెండోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆమె 15 ఏళ్ల పాలనలో మానవత్వానికి వ్యతిరేకంగా అనేక నేరాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం మరోసారి వారెంట్ ఇష్యూ చేశారు. షేక్ హసీనా పదవీ కాలంలో 500 మందికి పైగా వ్యక్తులు భద్రతా దళాలచే కిడ్నా్ప్ చేయబడి రహస్య ప్రాంతాల్లో ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. హసీనాతో పాటు ఆమె పాలనలో అధికారులు 11 మందిపై కోర్టు వారెంట్ జారీ చేసింది.
విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గతేదాడి ఆగస్టు 05న షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆమెని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ని కోరుతోంది. హసీనా చేసిన నేరాలకు న్యాయాన్ని ఎదుర్కోవాలని ఆదివారం ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. బంగ్లాదేశ్ అధికారులు డిసెంబర్ 23న షేక్ హసీనా అప్పగింత గురించి భారత్‌ని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com