Uttarpradesh: భీమ్ ఆర్మీ కార్యకర్త ఆత్మహత్యకు పోలీసులే కారణమా

Uttarpradesh: భీమ్ ఆర్మీ కార్యకర్త ఆత్మహత్యకు పోలీసులే కారణమా
X
సబ్-ఇన్‌స్పెక్టర్ 75,000 డిమాండ్ చేశారని ఆరోపణ

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో, ఒక కార్మికుడు, భీమ్ ఆర్మీ కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు అతనిపై వేధింపులకు పాల్పడ్డారని సమాచారం. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ₹75,000 డిమాండ్ చేశారని ..డబ్బు చెల్లించకపోతే అతనిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాల కింద కేసులు నమోదు చేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బారాబంకిలోని జైద్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అశోక్ కుమార్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన అక్టోబర్ 1, 2025 రాత్రి జరిగింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన అశోక్ కుమార్ తన గ్రామం మౌత్రి వెలుపల ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు..ఈ పోలీసు వేధింపుల కేసు సెప్టెంబర్ 25, 2025న ప్రారంభమైంది, అశోక్ తన తోటి గ్రామస్థుడైన రాముతో ఆర్థిక లావాదేవీ విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. స్టేషన్ ఇన్‌ఛార్జ్ , సబ్-ఇన్‌స్పెక్టర్ ₹75,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని అశోక్ కుటుంబం ఆరోపించింది.

కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. రాము పోలీసులతో కుమ్మక్కై అశోక్ పై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. పోలీసులు తనను..తన తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి, వారిపై దాడి చేసి, పదే పదే 75,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అశోక్ కుమారుడు రవి కుమార్ పేర్కొన్నాడు. జైద్‌పూర్ పోలీస్ . ఈ కేసులో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబం విజ్ఞప్తి చేసింది.

Tags

Next Story