పవార్ రాజీనామా.. ఒప్పుకోని బారామతి

పవార్ రాజీనామా.. ఒప్పుకోని బారామతి
శరద్ పవార్ స్వస్థలం బారామతి ఆయన రాజీనామాను ఆమోదించలేదు. పవార్ 1967 నుండి 1990 వరకు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది.

శరద్ పవార్ స్వస్థలం బారామతి ఆయన రాజీనామాను ఆమోదించలేదు. పవార్ 1967 నుండి 1990 వరకు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఆయన సుదీర్ఘకాలం ఎంపీగా లోక్‌సభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 1967 నుంచి పవార్ కుటుంబం బారామతిని అరచేతిలో పెట్టుకుని కాపాడుతోంది. ప్రస్తుతం పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అజిత్ పవార్‌కు, లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆయన కుమార్తె సుప్రియకు అప్పగించారు.

ఐదున్నర దశాబ్దాల పాటు అగ్రగామిగా ఉన్న శరద్ పవార్ రాజీనామాను ఎప్పటికీ ఆమోదించబోమని బారామతి శ్రేణులు అంటున్నాయి. “పార్టీ అంటే అధికారం. ఆయన లేకుండా మేం ఎలా ముందుకు వెళ్లగలం? అని బారామతిలోని పాఠశాల యజమాని జవహర్ షా ప్రశ్నించారు. రాజీనామా ప్రకటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బారామతికి చెందిన యోగేష్ జగ్తాప్ అన్నారు. ఎన్సీపీలో శరద్ పవార్, శివసేనలో బాల్ థాకరే స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పవార్ లాంటి గొప్ప నాయకుడు మనకు ఎక్కడా కనిపించడు అని బారామతి గ్రామవాసి మదన్ దేవకటే అతడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

శరద్‌పవార్‌ రాజీనామాతో నిరాశ చెందిన సీనియర్‌ నేత జితేంద్ర అవద్‌ ఎన్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడైన నాయకుడు. థానేకి చెందిన పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా రాజీనామా చేసినట్లు జితేంద్ర పేర్కొన్నారు.

కార్యాలయంలో ఈరోజు ఆరోజు అని లేకుండా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఓపిగ్గా పరిశీలించేవారు పవార్. రాజీనామా చేసినప్పటికీ, దక్షిణ ముంబైకి చెందిన వైబి చవాన్ సెంటర్‌కు వస్తున్నారు శరద్ పవార్. పార్టీ కార్యకర్తలు, ఫిర్యాదులతో వస్తున్న వారు యధావిధిగా ఆయనను కలుస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే గడుపుతున్నారు. శరద్ పవార్‌పై అత్యధిక ప్రభావం చూపిన నాయకుడు మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వై.బి.చవాన్. ఆయన పేరు మీద ఉన్న ట్రస్టుకు శరద్ పవార్ అధ్యక్షుడు.

పూణేకు చెందిన సందీప్ కాలే అనే ఆటో డ్రైవర్ రక్తంతో లేఖ రాశాడు. సామాన్య పార్టీ కార్యకర్తలు పవార్‌ని దేవుడిగా పూజిస్తున్నారు. వారంతా అనాథలు కాకూడదు.. మీరు రాజీనామా ఉపసంహరించుకోండి అని సందీప్ లేఖలో పేర్కొన్నారు. సందీప్ పదేళ్లుగా ఆటోడ్రైవర్‌గా, పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకోవాలని పవార్‌ని అభ్యర్థించారు.

Tags

Next Story